రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్. జి రాయికల్ మండలం చెర్ల కొండాపూర్ గ్రామానికి చెందిన గుడికందుల ప్రదీప్ మధ్యతరగతి నిరుపేద కుటుంబానికి చెందిన గుడికందుల ప్రదీప్ చిన్నప్పటి నుండే వివేక నంద స్వామి కథలు చదివి అయన స్పూర్తితో ముందుకు సాగే వాడు ఎదో సాధించాలి అనే తపనతో పట్టుదలతో చదివి మహాత్మా గాంధీ యునివర్సిటీ లో బ్యాచిలర్ అప్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యను చదివి, ప్రస్తుతం ఉస్మానియా యునివర్సిటీ లో మాస్టర్ ఆప్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేస్తున్నాడు. మర్షర్ ఆర్ట్ లో కఠోర శ్రమతో గ్రీన్ బెల్ట్ సాధించారు. ఆల్ ఇండియా యునివర్సిటీ చండీఘర్ లో క్వన్ కి డో అనే మార్షల్ ఆర్ట్ ను ఉస్మానియా తరుపున ప్రదర్శించి అక్కడ నిర్వహుకుల మెప్పించారు. గత సంవత్సరం ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలలో మంచి మార్కులు సాధించి ఇంటర్వూలో అధికారులను మన్ననలు పొంది గురుకుల ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగం సాధించాడు. ఇటీవల తెలంగాణ క్రీడా శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు ప్రదీప్ కు ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. చిన్నప్పటి నుండి సామాజిక సేవలో ముందు ఉంటూ అనేక సేవ కార్యక్రమాలు చేసే ప్రదీప్ కరోన సమయంలో ఇంటి వారే దగ్గరకు రావాలంటే భయపడ్డ ఆ రోజులలో కరోన తో మరణించిన మరియు అనాథ శావాలకు అంత క్రియలు చేశారు, దాంతో పాటు ఇప్పటికి తొమ్మది సార్లు రక్తదానం చెయ్యగా దాదాపు వెయ్యి మంది రోగులకు ప్లేట్ లెట్స్ రక్తం దానం చేపించాడు. ఒకవైపు సామాజిక సేవలో మరోవైపు విద్యను సమర్థవంతంగా రాణించి ఉద్యోగం పొందిన ప్రదీప్ నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.