|
modi add 1

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి..

మాదక ద్రవ్యాలతో యువత భవిష్యత్తు బుగ్గిపాలు.. మాదకద్రవ్యాల నివారణ సమాజంలో అందరి బాధ్యత.... మాదకద్రవ్యాల నియంత్రణ సమాజంలో అందరి బాధ్యత బి ఎం ఎస్ జిల్లా కన్వీనర్ అనంతుల సతీష్.. గురు వారం ఒక ప్రకటనలో కోరారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసలైన బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల రవాణా అధికంగా జరుగుతుందని పోలీసు యంత్రాంగం దృష్టిసారించి నిర్వహించాలన్నారు. పోలీస్ యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని కోరారు. పెడదారి పడుతున్న యువత కు కళాశాలల్లో కౌన్సిలింగ్ కల్పించాలని తల్లిదండ్రులు సైతం పిల్లల ప్రవర్తన పై దృష్టి సాధించాలని సూచించారు. యువతను పెడదోవ పట్టిస్తున్న వ్యాపార వర్గాల పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు

By NYALAKONDA ANIL DESAI | February 29, 2024 | 0 Comments

ప్రతీ క్షణాన్ని తీయని వెన్నెలలా మారుస్తూ మన తోడు ఉండే బంధం ఒక్కటే స్నేహం .

మన ప్రతీ కష్టంలో సుఖంలో జీవితాంతం మన వెన్నంటి ఉండి ప్రతీ క్షణాన్ని తీయని వెన్నెలలా మారుస్తూ మన తోడు ఉండే బంధం స్నేహం ఒక్కటే. అటువంటి బంధానికి గొప్ప పండగ స్నేహితుల దినోత్సవం. భారత దేశంలో ప్రతీ సంవత్సరం ఆగస్టు నెల మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. జీవితంలో ప్రతీ రోజును ఆనందంగా ఉంచే మిత్రులతో రాయికల్ పట్టణంలోని కేశవనగర్ పద్మశాలి యువజన సంఘం సభ్యులు ఆనందంగా ఆత్మీయంగా కలుసుకొని స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకొన్నారు. స్నేహితులు అంటే కేవలం ఒక్క పాఠశాలలో చదివేవారు మాత్రమే కాదు ఆపదలో, సంతోషంలో వెన్నటి ఉండి మనకు తోడునీడగా ఉండే ప్రతీ ఒక్కరూ మన స్నేహితులే అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘ అధ్యక్షులు ఎలిగేటి సత్యనారాయణ,ఉపాధ్యక్షులు బొమ్మ కంటి నాగరాజు , ప్రధాన కార్యదర్శి గంట్యాల ప్రవీణ్, సంఘ సభ్యులు మామిడాల రాజశేఖర్, రంజిత్, రమేష్, చిలివేరి శ్రీనాథ్, అను మల్ల వెంకటేష్, సాయి,కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | August 05, 2024 | 0 Comments

పద్మశాలి యువజన సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

రాయికల్ పట్టణలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మార్కండేయ మందిరంలో పూజలు నిర్వహించి అనంతరం పద్మశాలి యువజన సంఘం 2026వ నూత‌న సంవ‌త్స‌ర క్యాలెండ‌ర్‌ను శనివారం ఆవిష్క‌రించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు సేవా సంఘం అధ్యక్షులు భోగ రాజేశం, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల నరేష్, ఉపాధ్యక్షుడు దాసరి గంగాధర్ కోశాధికారి ఆడేపు నర్సయ్య యువజన సంఘం అధ్యక్షులు సామల్ల సతీష్, ప్రధాన కార్యదర్శి ఆడెపు రాజీవ్, ఉపాధ్యక్షులు ఎలిగేటి సత్యనారాయణ,సింగని సతీష్, కోశాధికారి బొమ్మకంటి నవీన్, సంయుక్త కార్యదర్శి అనుమల్ల చంద్ర తేజ, గంట్యాల ప్రవీణ్,అష్టమవాడ పెద్దలు, కట్టెకోల భాస్కర్ దాసరి శ్రీను, శ్రీరాముల వెంకటస్వామి,మరియు కార్యవర్గ సభ్యులు, పద్మశాలి రాష్ట్ర కార్యదర్శి జక్కల చంద్ర శేఖర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మ్యాకల రమేష్, నాగారం ఆంజనేయస్వామి దేవస్థానం చైర్మన దాసరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | January 24, 2026 | 0 Comments

Hot Categories

2
8