మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు.... ఈరోజు మంగపేట మండల మల్లూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు యాకుబి గారి మనవరాలు ఎండీ సన కు ఫల పుష్పాలంకరణ వేడుకకు హాజరై ఆశీర్వదించిన మంగపేట మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో.... జిల్లా హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్ టి ఐ చైర్మన్ బండా జగన్మోహన్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యానయ్య, జిల్లా సెక్రటరీలు తుడి భగవాన్ రెడ్డి, పూజారి సమ్మయ్య, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పెద్ది నరసింహారావు, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాటబోయిన నరసింహారావు, మండల ప్రచార కార్యదర్శి ఎర్రoగాని సురేష్, మండల సీనియర్ నాయకులు.. గడ్డం చిరంజీవి, తోట అశోక్, నలబోయిన లక్ష్మణరావు, మహబూబ్ హుస్సేన్, జట్టి రాజు, గడ్డం సురేష్, తదితరులు హాజరయ్యారు.....
ఈరోజు మంగపేట మండల నరసింహ సాగర్ గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరీ అనసూయ సీతక్క గారి చొరవతో మంజూరైన 10 లక్షల సిసి రోడ్డును కొబ్బరికాయ కొట్టి రోడ్డును ప్రారంభించిన మండల పార్టీ అధ్యక్షులు మైల జయరాం రెడ్డి గారు ఈ కార్యక్రమం లో.... గ్రామ పార్టీ అధ్యక్షులు తాతినేని హరికృష్ణ, మండల యూత్ అధ్యక్షులు మురుకుట్ల నరేందర్, మండల ఉపాధ్యక్షులు గాదె శ్రావణ్ కుమార్, మండల సీనియర్ నాయకులు... లోకు సత్యం, అన్నాల వెంకన్న, కొంకర బుచ్చి రాములు, బండి రాములు, దోమల నరేందర్, కోడం శ్రీకాంత్, దోమల పుల్లారావు, బోడ సతీష్, చందా నరేష్, తదితరులు హాజరయ్యారు....
సామాజిక సమరసత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర సంయోజక్ అప్పాల ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి కరీంనగర్ పట్టణంలోని కోదండ రామాలయంలో జరిగిన సమరసతా సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమరసత కోసం జీవించిన భాగ్యరెడ్డి వర్మ, గౌతమ బుద్ధుడు, వీర సావర్కర్, అహల్య భాయి హోల్కర్ ల జయంతుల సందర్భంగా ఈ సమ్మేళనం జరిగింది. భారతదేశం వైవిధ్యంతో కూడిన దేశమని, ఇక్కడ సామరస్యం తప్ప సంఘర్షణ జరుగదని తెలిపారు. మహాపురుషులు అనేకమంది సామాజిక సమరసతకు వారి జీవితాలు అర్పించారని కొనియాడారు. భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ భవనం ద్వారా బాలికలకు పాఠశాల ప్రారంభించారని వివరించారు. బుద్ధుని అహింస, శాంతిని అందించే బౌద్ధం ప్రపంచంలో అనేక దేశాలకు విస్తరించిందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య వీర సావర్కర్ తన సొంత జిల్లాలో హరిజనులను పూజారులుగా నియమించారని చేపరు. అహల్య భాయి హోల్కర్ దేశంలోని ప్రధాన మందిరాలను పునర్నిర్మాణం చేసినట్లు తెలిపారు. స్త్రీ నేతృత్వ శక్తికి అహల్య భాయ్ నిదర్శనం అని ఆయన అన్నారు.సమరసత వేదిక గ్రామాల్లో అన్ని కులాల మధ్య సమన్వయం సాధించటానికి పని చేస్తుందని చెప్పారు. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం అనే స్ఫూర్తి అంతటా నేడు కనిపిస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో ఇదే హిందూ భావనతో సమాజం అంతా ఐకమత్యం తో శక్తివంతంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమ్మేళనంలో వేదిక జిల్లా అధ్యక్షులు తుమ్మల రమేష్ రెడ్డి,పుల్లూరు రామారావు, మహిళా విభాగం వినోద, సంధ్య మరియు సభ్యులు పురుషోత్తం, సంతోష్, నర్సింగం తదితరులు పాల్గొన్నారు.
రాయికల్ పట్టణ ఆర్యవైశ్య సంఘ మహిళ అధ్యక్షురాలుగా జిల్లా లావణ్య , ప్రధాన కార్యదర్శిగా సిద్ధంశెట్టి స్వప్న, కోశాధికారిగా ఐతమాధవి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఏర్పాటు చేయడానికి పట్టణ సంఘ అధ్యక్షులు కూరగాయల రవికుమార్ ,ప్రధాన కార్యదర్శి గరిపెల్లి శ్రీనివాస్ ,కోశాధికారి పల్లెర్ల పవన్ కుమార్, మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని కార్మిక సంక్షేమమును పూర్తిగా విస్మరించిందని తెలంగాణ కన్స్ట్రక్షన్ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మోహన్ రెడ్డి విమర్శించారు.ఆదివారం నాడు కరీంనగర్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కార్మిక శాఖకు మంత్రి లేడని ఎద్దేవా చేశారు.కార్మిక శాఖ అధికారుల ఇష్టారాజ్యమైందని ఆరోపించారు.భవన నిర్మాణ కార్మికులకు చెందవలసిన నిధులను పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని,అందువల్ల కార్మికులకు కొత్త రూల్స్ పెట్టి లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కార్మిక శాఖ అధికారులు తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. సంవత్సరం కాలంగా బోర్డు నుంచి అందాల్సిన పథకాల రూపాయలు అందట్లేవని వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు.15 సంవత్సరాల నుండి కార్మికులకు కనీస వేతనం పెంపుకు నోచుకోవట్లేదని,ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ కార్మికుల కడుపు కొడుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ,బి ఎం ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పప్పుల సురేష్,ప్రదీప్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కరీంనగర్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు పసుల శ్రావణ్,తోర్తి శ్రీనివాస్,మోగిలిపాలెం తిరుపతి,సత్యం తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని మార్కండేయ పద్మశాలి సంఘం భవనంలో జేఏసీ ఆధ్వర్యంలో ఐజేయు నూతన జిల్లా కార్యవర్గానికి ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చీటి శ్రీనివాస్ మాట్లాడుతూ, "జర్నలిస్టులకు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం,ఆరోగ్య కార్డులు,బీమా వంటివి అందించేందుకు కృషి చేస్తాను. జర్నలిస్టులు ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే వారధిలా పనిచేస్తున్నారు. కానీ వారి సమస్యలు మాత్రం ఇంకా పరిష్కారం కావడం లేదు. వాటిని అధికారులకు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాను," అని అన్నారు. రాయికల్‌కి చెందిన జర్నలిస్టులు ఐక్యతతో ఉన్నందుకు అభినందించిన ఆయన, ఇతర ప్రాంతాల్లో కూడా ఇది ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణ చారి, ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, అల్లె రాము, సంయుక్త కార్యదర్శి గుర్రం చంద్రశేఖర్, కోశాధికారి సిరిసిల్ల వేణుగోపాల్, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగిరెడ్డి రఘుపతి, ఇందూరి నరేష్, బూరం లక్ష్మణ్, పెరంబుదూరు శ్రీకాంత్, రాయికల్ ప్రెస్ జేఏసీ అధ్యక్షుడు వాసరి రవి, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్, సాంస్కృతిక కార్యదర్శి డాక్టర్ ఏ.ఎం. రాజు రెడ్డి, సంయుక్త కార్యదర్శి గంగాధరి సురేష్, సీనియర్ పాత్రికేయులు సింగిడి శంకర్, ముజాఫర్, బొంగోని శ్రీనివాస్, సింగని శ్యాంసుందర్, వాసం లింబాద్రి,గంట్యాల ప్రవీణ్, ఇమ్మడి విజయ్, తీగల గోపి, శ్రీను, వెంకటేష్, కిరణ్ రావు, నరేష్, శంకర్, షాకీర్, రమాపతిరావు, గంగాధర్, భీమరాజు, కళ్యాణ్, రషీద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.