అక్రమనిర్బంధాలు మందిర నిర్మాణాన్ని అడ్డుకోలేవు ; VHP అరెస్టులు, గృహ @ ముస్లిం మెప్పుకోసం హిందూ మందిరాల ధ్వంసం @ పోలీసులను ముందు పెట్టి భయ బ్రాంతులు సృష్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం @ అక్రమ కేసులు, అరెస్టులతో ఉద్యమం ఆగదు @ రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమించి మందిరం నిర్మించి తీరుతాం @ హిందువుల మనోభావాలు గౌరవించి మందిరం నిర్మించి తీరాల్సిందే..! @ తరతరాలుగా పూజలు అందుకుంటున్న పెద్దమ్మతల్లి విగ్రహాన్ని, మందిరాన్ని ధ్వంసం చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి @ సెక్యులరిజం అంటే హిందుత్వాన్ని తొక్కిపెట్టడమేనా..? @ నిజాం వారసత్వాన్ని అందుకొని హిందువులపై దాడులకు దిగితే తగిన బుద్ధి చెప్పక తప్పదు..! పోలీసులను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహ కార్యదర్శి చింతల వెంకన్న, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, ధర్మ ప్రసార్ రాష్ట్ర కోకన్వీనర్ సుభాష్ చందర్ విమర్శించారు. ముస్లింల మెప్పు కోసం హిందూ మందిరాలను ధ్వంసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, భారతీయ జనతా పార్టీ నాయకుల అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలు కొనసాగాయి. మంగళవారం రోజు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ పెద్దమ్మ మందిరం దగ్గర కుంకుమార్చన నిర్వహించాలని చేపట్టిన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. అటువైపు వెళ్లేందుకు ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని అరెస్టు చేసి కార్ఖానా, బోయిన్పల్లి తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ చర్యలను విశ్వహిందూ పరిషత్ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్దమ్మ తల్లి మందిరం నిర్మించి, హిందువుల మనోభావాలు గౌరవించాల్సిందే నని పట్టుబట్టారు. మందిరం నిర్మించే వరకు పోరాటం ఆగదు అని తేల్చి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ,భారతీయ జనతా పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం, గృహాల్లో నిర్బంధించడం వంటి చర్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం నిజాం నిరంకుశ పాలనకు తిరతిస్తున్నదని దానిని హిందూ సమాజం ఒప్పుకోదని హెచ్చరించారు. బడుగుల పండుగ అయిన బోనాల ఉత్సవాలకు ప్రత్యేకంగా నిలిచే పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హిందువుల మనోభావాలపై దాడి చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు తో సహా నాయకులందరినీ అరెస్టు చేసి పెద్దమ్మ తల్లి పూజకు దూరం చేసిన కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెబుతామని విశ్వహిందూ పరిషత్ నాయకులు హెచ్చరించారు. రాబోవు రోజులలో రెట్టింపు స్థాయిలో ముందుకు వెళ్లి మందిరాన్ని నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. సెక్యులరిజం పేరుతో హిందూ సమాజాన్ని తొక్కి పెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. పెద్దమ్మ తల్లి పరిసర ప్రాంతాలకు ఎవరిని అనుమతించకుండా దాదాపు 1200 మంది పోలీసులను మోహరించడం నిజాం పరిపాలనకు నిదర్శనం అన్నారు. దాదాపు 2000 మంది బజరంగ్దళ్ కార్యకర్తలను అరెస్టు చేసేదాకా వదలమని పోలీసులు హెచ్చరించడం దుర్మార్గమని నాయకులు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రధాన పీఠ వేస్తున్నారని, అదే సమయంలో హిందువుల మనోభావాలను పూర్తిగా విస్మరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ తీరును విశ్వహిందూ పరిషత్ నేతలు తప్పు పట్టారు. తరతరాలుగా పూజలందుకుంటున్న పెద్దమ్మతల్లి విగ్రహాన్ని అపవిత్రం చేసి, మందిరాన్ని ధ్వంసం చేసి , హిందువులపై ఘోరమైన కేసులు నమోదు చేయడం , లాఠీచార్జ్ చేయడం, మహిళలను చితకబాదడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగదన్నారు. అమ్మవారి విగ్రహాన్ని అపవిత్రం చేసి, విగ్రహాన్ని తరలించి, మందిరాన్ని ధ్వంసం చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదుల మాదిరి హిందూ నాయకులపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, భయభ్రాంతులకు గురి చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని వారు హెచ్చరించారు. నిర్బంధాలు, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు అన్నింటిని ఎదుర్కొని.. పెద్దమ్మతల్లి పవిత్రతను కాపాడి భవ్యమైన మందిర నిర్మాణం నిర్మాణం సాధించి తీరుతామని స్పష్టం చేశారు. అరెస్టులు, అక్రమ కేసులు తమకు కొత్త కాదని.. లక్ష్యం చేరే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని విశ్వహిందూ పరిషత్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భవదీయ పగుడాకుల బాలస్వామి ప్రచార ప్రముఖ్ విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్రం 99129 75753 9182674010
Your experience on this site will be improved by allowing cookies.