ఈ రోజు 02-03-2024 న వరంగల్ పార్లమెంట్ ఆస్పరెంట్ Dr జన్ను పరంజ్యోతి గారు హనుమకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు పరంజ్యోతి ఫౌండేషన్ (JPF) ద్వారా బహుమతులు మరియు నగదు అందివ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రాము మిత్ర మండలి వారికి మరియు అరవింద్ మిత్ర మండలి వారికి Dr జన్ను పరంజ్యోతి గారు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా గారు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ" బన్న ఐలయ్య గారు ఉదయ భాను కార్యక్రమ నిర్వాహకులు, అజీజ్ ఖాన్ అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు మరియు తల్లపెల్లి జయపాల్ క్రికెట్ దిగ్గజం పాల్గొనడం జరిగింది
జాతీయస్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్ కి ఎంపికైన బ్లూమింగ్ బడ్స్ విద్యార్థిని నిజామాబాదు : ఇటీవల మెదక్ లో జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్ లో మెరుగైన ప్రతిభ కనబరిచిన బ్లూమింగ్ బడ్స్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న Y.ప్రజ్ఞ జాతీయ స్థాయికి ఎంపికయ్యింది. నిజామాబాద్ జిల్లా నుంచి జాతీయస్థాయి కి తమ విద్యార్థి ఎంపిక కావడం ఆనందంగా ఉందని పాఠశాల కరస్పాండెంట్ ప్రసన్నకుమారి విద్యార్థిని అభినందించారు. జాతీయ స్థాయి పోటీలు డిసెంబర్ 6 నుంచి 10 తేది వరకు జమ్మూ కాశ్మీర్ లో జరగనున్నాయి. ఈ సందర్భంగా బోధన్ ఎంఎల్ఏ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ఆటలలో ప్రోత్సహిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని మరియు విద్యార్థినిని అభినందించారు.
Your experience on this site will be improved by allowing cookies.