జగిత్యాల పట్టణంలో అత్యవసరంగా ఎ+ పాజిటివ్ రక్తం గర్భిణీ స్త్రీ సర్జరీకి అవసరం కాగా వారు రాయికల్ న్యాయవాది అల్లె పురుషోత్తం ను సంప్రదించగా శాశ్వత రక్త దాత అయినటువంటి రాయికల్ కి చెందిన అశోక్ కి తెలపడంతో శుక్రవారం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి 25వసారి రక్తదానం చేయడం జరిగింది. ప్రజలు యువత ముందుకు వచ్చి అత్యవసర పరిస్థితిలో ఉన్నవారికి రక్తదానం చేయాలని రక్త దానం చేయడం వల్ల మంచి ఆరోగ్యమే కాదు మానసిక శ్రేయస్సు కూడా పెరుగుతుంది అని రక్త దానం వల్ల మనం కొందరి ప్రాణాలను కాపాడిన వారిమి అవుతాము. అత్యవసర సమయాలలో రక్త దానం చేయడం వల్ల ఒక దేవుడిలా చూస్తారు రక్త గ్రహీతలు. అంటే వారిలో ఎంత సంతోషం ఉంటుందో ఒకసారి ఆలోచించండి అని ఈ సందర్బంగా కుశనపల్లి అశోక్ తేలియాజేశాడు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.