|
modi add 1

పోలీస్ డిపార్ట్మెంట్ కి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి. -రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాసులు, ఐపిఎస్.

గోదావరిఖని/జనంగొంతు/అంబటి సతీష్ / రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ నుండి ఎన్నికైన మీరు క్రమశిక్షణ తో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవాలని ట్రైనీ కానిస్టేబుళ్ళకు పోలీస్ కమిషనర్ సూచించారు. పోలీస్‌ కానిస్టేబుళ్ళ నియామకంలో భాగంగా స్టయిఫండరీ ట్రైనీ పోలీస్‌ కానిస్టేబుళ్ళగా ఎంపికై తొమ్మిది నెలల శిక్షణకు వెళ్ళుతున్న ట్రైనీ కానిస్టేబుళ్లతో రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం. శ్రీనివాసులు ఐపిఎస్ మాట్లాడడం జరిగింది. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నిర్వహించిన పోలీస్‌ కానిస్టేబుళ్ళ నియామాకాల్లో సివిల్ కానిస్టేబుళ్లు పురుషులు మొత్తం 150 శిక్షణా కేంద్రం ఖమ్మం, ఆర్ముడ్ కానిస్టేబుళ్లు పురుషులు మొత్తం 110 శిక్షణా కేంద్రం వికారాబాద్, AR మహిళా కానిస్టేబుళ్లు మొత్తం 35 శిక్షణా కేంద్రం,మేడ్చల్, సివిల్ మహిళా 86 శిక్షణా కేంద్రం TSPA, హైదరాబాద్ లో తొమ్మిది నెలల శిక్షణ అందజేయబడుతుందని. నేటి పరిస్థితులకు తగ్గట్లుగా ప్రజలకు సేవలందించే రీతిలో ట్రైనీ కానిస్టేబుళ్ళకు శిక్షణ సమయంలో మానసికంగా, శారీరకంగా, అలాగే వివిధ అంశాలపై అవగాహన కల్పించే తరహలో శిక్షణ అందజేయబడుతుందని. మీరు ఎలాంటి పరిస్థితులోనైనా విజయంగా సాధించే తరహలో శిక్షణ అందించబడుతుందని, మీరూ పొందే శిక్షణతో మీరు పదవీవిరమణ పోందే వరకు ఎలాంటి సమస్య వచ్చిన ఎదుర్కోనే పోలీస్‌ అధికారిగా రూపాంతరం చెందుతారని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ప్రజలకు దగ్గరగా ఉండి సేవా చేసే అవకాశం ఒక్క పోలీస్ శాఖ కి మాత్రమే ఉంటుంది అన్నారు. పోలీస్ ఉద్యోగం సాధించిన మీకు సమాజం లో, కుటుంబంలో మంచి మర్యాద, గౌరవం, గుర్తింపు లభిస్తుంది అన్నారు.

By NYALAKONDA ANIL DESAI | February 19, 2024 | 0 Comments

పిడిఎస్ రైస్ పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్సు పోలీసులు.

గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి చుట్టప్రక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి పిడియస్ బియ్యన్ని అక్రమ రవాణా చేస్తున్న వారిని టాస్క్ ఫోర్సు సిబ్బంది శ్రీనివాస్, ప్రకాష్,అఖిల్లోద్దీన్, మల్లేష్ లు కలిసి కళ్యణ్ నగర్ వద్ద తనిఖీ నిర్వహించి AP 15TA 1957 టాటా ACE ట్రాలీ ను ఆపి తనిఖీ చేయగా బ్యాగ్ లలో నింపి ఉన్న పిడియస్ రైస్ సుమారు 25 క్వింటాళ్ల గుర్తించి వాటిని స్వాధీన పరుచుకొని ట్రాలీ లో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోని తదుపరి విచారణ నిమిత్తం గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ వారికీ అప్పగించినట్లు, నిందితుల వివరాలు 1) చింతల రాజేందర్ s/o పుల్లయ్య, 30 yrs , బుడిగె జంగం, ఎన్టీఆర్ నగర్, మంచిర్యాల. 2) చిప్పకుర్తి ప్రవీణ్ s/o లింగయ్య, మాది 22 yrs, ఎన్టీఆర్ నగర్, మంచిర్యాలగా పత్రికా ప్రకటనలో తెలియజేశారు.

By NYALAKONDA ANIL DESAI | March 04, 2024 | 0 Comments

రాయికల్ లో గంజాయి నిందితుల అరెస్ట్

గురువారం సాయంత్రం 4.00 గంటలకు జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్, IPS గారి ఆదేశాల మేరకు , జగిత్యాల డీఎస్పీ శ్రీ రఘు చందర్ గారి పర్యవేక్షణ లో, రూరల్ సిఐ శ్రీ ఆరిఫ్ అలీ ఖాన్ గారు మరియు రాయికల్ ఎస్సై అజయ్ మరియు వారి సిబ్బంది రాయికల్ శివారు లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు CCL, A-1 కొండూరి రాజేష్ మరియు A-2అరుముల్ల సాయి లు స్కూటీ పైన రాయికల్ వైపు జగిత్యాల నుండి వస్తుండగా, కుమ్మరిపల్లి బస్టాండ్ వద్ద వారిని పట్టుకొని విచారించగా వారి వద్ద గల సంచి లో 1.5 కిలోల ఎండు గంజాయి ఉన్నది. నిందుతుల వద్ద నుండి గంజాయి, సెల్ ఫోన్ లు మరియు స్కూటి ని స్వాధీన పరచుకొని విచారించగా వారు చేసిన నేరం ఒప్పుకున్నారని ప్రెస్ మీట్ లో తెలియజేశారు.

By NYALAKONDA ANIL DESAI | March 28, 2024 | 0 Comments

271 గ్రాముల గంజాయిని పట్టుకున్న పోలీసులు

సుల్తానాబాద్, జూలై 14 (జనం గొంతు) : సుల్తానాబాద్ పట్టణంలో 271 గ్రాముల గంజాయిని పట్టుకున్న పోలీసులు. పట్టణంలోని పూసాల రోడ్డులో ఎస్సై శ్రావణ్ కుమార్ పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాలు నిర్వహిస్తుండగా పూసాల నుండి సుల్తానాబాద్ వైపు స్కూటీపై వస్తున్న ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో,ఆపి చెక్ చేయగా స్కూటీలో గంజాయి లభించింది. పంచాయతీ సెక్రటరీలు ప్రమోద్ కుమార్, పాపయ్య లు ఎస్సై శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి, విచారించగా నిందితుడు చంద్రపూర్ నుండి గంజాయి విక్రయించి తీసుకొచ్చి సుల్తానాబాద్ లో సప్లై చేస్తున్నట్టుగా అంగీకరించాడని, అతని వద్ద రైల్వే టికెట్ బస్సు టికెట్ మొబైల్ ఫోను బైక్ 271 గ్రాముల గంజాయి లభించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

By NYALAKONDA ANIL DESAI | July 14, 2024 | 0 Comments

బారి కుట్ర బట్ట బయలు-పెద్ద ఫ్యక్తరీనే తెరిచారు

దేశంలో ఓ పెద్ద ఇస్లామిక్ ఉగ్రవాద ఆపరేషన్ ను భగ్నం చేసింది గుజరాత్ ఏటీఎస్. గుజరాత్ గాంధీనగర్ లోని అదాలజ్ టోల్ ప్లాజా సమీపంలో ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. గుజరాత్ లో ఉగ్రదాడికి ప్రణాళికలు వేసినట్లు విచారణలో తేలింది. మరోవైపు ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి తుపాకులు, విషపూరిత రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా విచారణ కొనసాగుతోందని ఏటీఎస్ పేర్కొంది. అబ్దుల్ ఖాదర్ జిలానీ కుమారుడు డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, మహ్మద్ సులేమాన్ కుమారుడు మహ్మద్ సుహైల్ మరియు సులేమాన్ సైఫీ కుమారుడు ఆజాద్ అనే ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్టు చేసింది.అరెస్టయిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ హైదరాబాద్ నివాసి. మొహమ్మద్ సుహెల్ మొహమ్మద్ సులేమాన్ మరియు ఆజాద్ సులేమాన్ సైఫీ ఇద్దరూ ఉత్తరప్రదేశ్ నివాసితులు. ముగ్గురి వయస్సు దాదాపు 25 సంవత్సరాలు. ముగ్గురు ఉగ్రవాదులను ఓ సంవత్సరం పాటు నిఘాలో వుంచింది ఏటీఎస్. వారి లొకేషన్ ను నిరంతరం ట్రాక్ చేసి, వారి ప్రతి కదలికను పరిశీలించారు. ఈ ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదులు రైజిన్ అనే అత్యంత విషపూరితమైన ద్రవాన్ని తయారు చేస్తున్నారు.

By NYALAKONDA ANIL DESAI | November 10, 2025 | 0 Comments

ఆర్టీసీ కార్మికులు శాంతియుత వాతావరణం లో సమ్మె నిర్వహించుకోవాలి ప్రజా అశాంతికి గురి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు : పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం

ఆర్టీసీ కార్మికులు శాంతియుత వాతావరణం లో సమ్మె నిర్వహించుకోవాలి ప్రజా అశాంతికి గురి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు : పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కరీంనగర్ ‌లో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో చట్టాన్ని కాపాడటం పోలీస్ శాఖకు ప్రధాన ప్రాధాన్యతగా ఉందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం స్పష్టం చేశారు. సమ్మెను ప్రజాస్వామ్యపరమైన హక్కుగా గౌరవిస్తున్నప్పటికీ , అది పూర్తిగా శాంతియుత వాతావరణంలోనే నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పేర్కొన్న ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి: 1) సమ్మె కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవలు వినియోగించే ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ మరియు రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. 2) ప్రైవేట్ డ్రైవర్లు తాత్కాలికంగా విధుల్లోకి వచ్చినా, అలాగే ఆర్టీసీ డ్రైవర్లు తిరిగి డ్యూటీలో చేరినా, వారికి ఎటువంటి బెదిరింపులు లేకుండా పూర్తి స్థాయిలో పోలీస్ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. 3) బస్సుల రాకపోకలు , డిపో ప్రాంతాలు , ముఖ్య కూడళ్లు , మరియు బస్టాండ్ పరిసరాల్లో అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 4) ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించినా, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించినా, అధికారులపై దాడులకు పాల్పడినా, అలాంటి వారిపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 5) సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం , వదంతులు వ్యాప్తి చేసిన వారిపైనా పర్యవేక్షణ కొనసాగుతోందని , అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 6) సమ్మెలో పాల్గొనే కార్మికులు మరియు ప్రజలు పరస్పర గౌరవం పాటిస్తూ, ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. 7) శాంతి భద్రతల విఘాతం కలగకుండా సమ్మె నిర్వహించుకోవాలని ఎక్కడనైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటట్లు చర్యలు చేపడితే వారిపై చట్ట ప్రకారం చర్యలు మరియు వారి ఉద్యోగం పరంగా శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్టీసీ అధికారులు తెలిపారన్నారు . 8) కరీంనగర్ ప్రజల శాంతి భద్రతలను కాపాడటంలో పోలీస్ శాఖకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా, ఆర్టీసీ బస్సులు నడిపే డ్రైవర్లను బెదిరింపులకు గురించేసినా వెంటనే కరీంనగర్ పోలీసు స్పెషల్ బ్రాంచి కంట్రోల్ రూమ్ నంబర్ 8712670713 కు కాల్స్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ కోరారు.

By NYALAKONDA ANIL DESAI | April 24, 2026 | 0 Comments

మహిళా కార్మికురాలిపై థర్డ్ డిగ్రీ ప్రయోగం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు

మహిళా కార్మికురాలిపై థర్డ్ డిగ్రీ ప్రయోగం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు: పోలీసుల వివరణ ​కరీంనగర్ టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళా మున్సిపల్ కార్మికురాలిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ సోషల్ మీడియా మరియు కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తలు/వదంతుల్లో ఎలాంటి వాస్తవం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ​ఈ విషయమై సప్తగిరి కాలనీ, కరీంనగర్‌కు చెందిన రాయనవేణి లక్ష్మి (భర్త: రాజయ్య, వయస్సు 52 సంవత్సరాలు, వృత్తి: లేబర్) స్వచ్ఛందంగా తన స్టేట్‌మెంట్‌ను విడుదల చేశారు. ​బాధిత మహిళ తన స్టేట్‌మెంట్‌లో తెలిపిన వివరాల ప్రకారం: ​ఆమె పని చేసే ఇంటి యజమానురాలు మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమీషనర్ సువార్త బంగారం పోయిందని ఫిర్యాదు చేయడంతో, విచారణ నిమిత్తం పోలీసులు లక్ష్మిని పిలిచారు. స్టేషన్‌కు వెళ్లిన లక్ష్మిని పోలీసులు కేవలం విచారించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు తప్ప... ఆమెను కొట్టడం కానీ, తిట్టడం కానీ చేయలేదు. ​అయితే, తమపై ఎక్కడ కేసు అవుతుందో అనే భయంతో, స్థానిక విలేకరి అడిగినప్పుడు భయపడి పొరపాటున పోలీసులపై తప్పుడు సమాచారం ఇచ్చామని ఆమె అంగీకరించారు. విలేకరి పేపర్‌లో ఏం రాశారో కూడా తనకు తెలియదని ఆమె పేర్కొన్నారు. ​కాగా, ఈరోజు (23-05-2026) ఉదయం ఫిర్యాదుదారురాలైన అడిషనల్ కమీషనర్ సువార్తను లక్ష్మి కలవగా... తనకు పోయిన బంగారు ఆభరణం దొరికిందని, పోలీసు కంప్లైంట్ వెనక్కి తీసుకుంటానని ఆమె తెలిపినట్లు లక్ష్మి స్పష్టం చేశారు. ​కాబట్టి, పోలీసు స్టేషన్‌లో మహిళపై థర్డ్ డిగ్రీ జరిగిందంటూ వస్తున్న వార్తలన్నీ కేవలం వదంతులేనని, ప్రజలు మరియు మీడియా ప్రతినిధులు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఈ పత్రికా ప్రకటన ద్వారా కోరడమైనది.

By NYALAKONDA ANIL DESAI | May 24, 2026 | 0 Comments

Hot Categories

2
7
1