రాయికల్ పట్టణ 4వ వార్డ్ లో మంగళవారం రోజున వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. వార్డు కౌన్సిలర్ తురుగ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నగరాలు, గ్రామీణప్రాంతాల్లో పచ్చదనం పరచుకుంటే జీవ వైవిధ్యంలో సమతుల్యత సాధించవచ్చు. పట్టణీకరణ, పరిశ్రమల కాలుష్యం కారణంగా దెబ్బ తింటున్న పర్యావరణానికి రక్షణకవచం ఏర్పడుతుంది. వాతావరణంలో ఆక్సీజన్ స్థాయి పెంచడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించవచ్చునన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ వెంకట్, వార్డ్ ఆఫీసర్ పోచయ్య, ప్రత్యూష, హరీష్ ఆర్. పి రిజ్వానా మరియు వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.