కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల గారు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేయడంతో సామాన్య ప్రజలకు కూడా రాజకీయంగా అవకాశాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ఆదేశాలు ఏనాడు పట్టించుకోలేదు. నేడు బిజెపి ఆధ్వర్యంలో ఏదైనా ఒక ఆదేశం జారీ అయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే విధంగా ఉంటుంది. అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట, 370 ఆర్టికల్ రద్దు చేయడం గొప్ప చారిత్రాత్మక ఘట్టాలు. తెలంగాణాలో బీజేపీ విజయ సంకల్ప యాత్రతో మంచి స్పందన వచ్చింది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశ వ్యాప్తంగా పారదర్శక పాలన కొనసాగిస్తున్నాం. అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తి చేశాం. మోడీ నేతృత్వంలో భారత్ వికసిస్తుంది. మరోసారి మోడీ గారికి, బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.