హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ ఏక్తా యాత్ర ర్యాలీకి పటిష్ట బందోబస్తు – కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌష్ ఆలం. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారంనాడు కరీంనగర్ నగరంలో నిర్వహించనున్న హిందూ ఏక్తా యాత్ర ర్యాలీ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీ విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులకు ఆయన బ్రీఫింగ్ నిర్వహించారు. సుమారు 400 మంది పోలీసు అధికారులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో స్టాటిక్ ఫోర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, రూఫ్‌టాప్ నిఘా, మొబైల్ పెట్రోలింగ్ పార్టీలు వంటి పలు రకాల విధులను కేటాయించినట్లు కమిషనర్ తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన అన్ని చోట్ల దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. హిందూ ఏక్తా యాత్ర శోభాయాత్రకు సంబంధించి పోలీసు శాఖ తరపున అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపట్టినట్లు కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌష్ ఆలం స్పష్టం చేశారు.
Your experience on this site will be improved by allowing cookies.