విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలు పెంపొందించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని జిల్లా తనిఖీ బృందం నోడల్ ఆఫీసర్ కోమ్మిడి లక్ష్మన్న సూచించారు. రాయికల్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల, బాలుర, ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాలను జిల్లా ప్యానల్ తనిఖీ బృందం బుధవారం పరిశీలించింది. తనిఖీలో భాగంగా పాఠశాలలోని మౌలిక వసతులు విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు ,రికార్డుల నిర్వహణ ,మార్కుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం తదితర అంశాలను పరిశీలించారు .తరగతి గదిలో బోధన విధానాన్ని పరిశీలించి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా కొమ్మిడి లక్ష్మన్న మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ స్లిప్ టెస్ట్ల ద్వారా వారి సామర్థ్యాన్ని అంచనా వేసి ఫలితాల ఆధారంగా గ్రూపులు విభజించాలని పేర్కొన్నారు. ' సి' గ్రేడ్ విద్యార్థుల సామర్థ్యాల పెరుగుదలకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, విద్యార్థులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. పరీక్షలలో మంచి చేతిరాత నైపుణ్యాలు యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు. ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారికి ఆసక్తి కలిగేలా బోధన ఉండాలని, ప్రణాళిక ప్రకారం బోధన చేయాలని, పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక slip tests ప్రతి రోజూ నిర్వహించాలని,విద్యార్థులకు 10/10 GPA సాధించేలా ప్రణాళిక ప్రకారం బోధించాలని తెలిపారు. పాఠశాలలో తప్పక ల్యాబ్ నిర్వహించాలని సూచించారు విద్యార్థుల పఠనాసక్తిని పెంపొందించడానికి గ్రంధాలయ నిర్వహణ కమిటీని పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తనిఖీ బృంద సభ్యులు శ్రీనివాసరావు, దాసరి రామస్వామి, ధర్మేందర్, శ్రీనివాస్ ,శ్రీధర్, రవీందర్, సంయుద్దీన్, లక్ష్మీరాం నాయక్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీపతి రాఘవులు,కాపు శ్రీనివాస్, యం,శ్రీనివాస్ ఉపాధ్యాయులు పొన్నం రమేష్ ,రవీందర్ ,మల్లేశం, గంగ జమున, సత్యనారాయణ, నాగరాజు, పద్మజ, తిరుమల ,గంగాధర్, వనిత, అలీ రాజా ,శివానందం, శ్రీకాంత్ ,రాము తదితరులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.