రాయికల్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో గురువారం ముందస్తు రక్ష బంధన్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా చిన్నారులు వివిధ రకాలైన వృత్తుల వేషధారణలో వచ్చి అలరించారు. పాఠశాల ప్రిన్సిపల్ జే వేణుగోపాల్ రావు మాట్లాడుతూ రక్షాబంధన్ అంటే సోదరి సోదరుల అనుబంధమే కాకుండా ఆరోగ్యకరమైన సమాజం కోసం పాటుపడాలని విద్యార్థులకు సూచించారు. రక్షా బంధన్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది సోదర ప్రేమ, రక్షణ మరియు బాధ్యతలను గుర్తుచేసే ఒక ముఖ్యమైన సందర్భం. ఈ పండుగను జరుపుకోవడం ద్వారా, మనం మన కుటుంబ సంబంధాలను బలోపేతం చేసుకోవాలి, అలాగే సమాజంలో సోదర భావాన్ని పెంపొందించుకోవాలి. మనదేశంలో ఇంత ప్రశాంతంగా ప్రతి ఒక్కరు జీవిస్తున్నారంటే దానికి నిరంతరం శ్రమించే కొన్ని వృత్తులు వారి త్యాగాలను విద్యార్థులకు వివరించారు. ప్రతి విద్యార్థి దేశ రక్షణకై సమాజ సేవకై పాటుపడాలని వివరిస్తూ రక్షాబంధన్ సందర్భంగా ప్రతి విద్యార్థి తన ఇంటి వద్ద ఒక మొక్కను నాటాలని ప్రిన్సిపల్ వేణుగోపాల్ రావు విద్యార్థులకు సూచించారు తదనంతరం తరగతి విద్యార్థులు అందరూ ఒకరికి ఒకరు రాఖీ కట్టుకొని "నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనిద్దరం దేశానికి రక్ష "అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ గారు జే తిరుపతి రావు గారు, ప్రిన్సిపల్ జె వేణుగోపాల్ రావు ,ఉపాధ్యాయులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.