కనగర్తి గ్రామంలోని స్థానిక దాసరి పద్మ హనుమయ్య జిల్లా పరిషత్తు పాఠశాల ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమ ప్రారంభోత్సవం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓదెల మండల ప్రత్యేక అధికారి శ్రీ ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించాలని, నాటిన మొక్కలు అన్నిటిని కూడా సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత పాఠశాలలోని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులను పరిశీలించి, పాఠశాల తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడినారు. ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించి.. పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కారానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓదెల ఎంపీడీవో తిరుపతి గారు, ఎంపీ ఓ భాస్కర్ గారు, ఏపీఎం లతా మంగేశ్వరి గారు ,పంచాయతీ కార్యదర్శి ముత్యాల సందీప్ గారు, ప్రధానోపాధ్యాయులు ఎర్ర రమేష్ గారు ,ఇన్చార్జ్ ఏపీవో శ్వేత గారు, టెక్నికల్ అసిస్టెంట్ జనార్ధన్ గారు, పి టి విష్ణు, గ్రామ పంచాయతీ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.