|
modi add 1

రాయికల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదిగలకే కేటాయించాలి: ఎమ్మార్పీఎస్

జగిత్యాల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు దుమల గంగారం మాదిగ మాట్లాడుతూ.కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం చేసిన రిజర్వేషన్ రద్దు చేసి ఇటీవల కాలంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు చేసిన విషయం తెలిసిందే. జగిత్యాల జిల్లాలో జనాభా తమాషా ప్రకారం రెండు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వాల్సి ఉండగా ఒకటి ధర్మపురి ఎస్సీ కాగా జగిత్యాల నియోజకవర్గంలో రాయికల్ జగిత్యాల ప్రస్తుతం జనరల్ చేశారు.గత ప్రభుత్వ రాయికల్ మాదిగలకు మార్కెట్ కమిటీ అవకాశం ఇచ్చాన కొద్దిరోజుల్లోనే పదవిపోవడం జరిగింది. రాయికల్ లో అదే రిజర్వేషన్ ఉంచకుండా జగిత్యాల నియోజకవర్గనికి ప్రాతినిత్యం వహిస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రిజర్వేషన్ జనరల్ చేసి మాదిగలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మమ్ములను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.జగిత్యాల నియోజకవర్గ నాలుగు మండల లో రెండు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండగా జగిత్యాల రాయికల్ జనరల్ కాగా అందులో ఒక మా మాదిగ సామాజిక వర్గానికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చి తన చిత్తశుద్ధి చాటుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. వివిధ మాధ్యమాల్లో ఎంపీకి పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది,ఈ రెండు మండలాల్లో ఏదో ఒకటి మా మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించకపోతే మిమ్మల్ని రానున్న రోజుల్లోఎంపీ కూడా ఓడ కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఎమ్మార్పీఎస్ జిల్లా పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్,ఉపాధ్యక్షులు బోనగిరి కిషన్,డివిజన్ అధ్యక్షులు నక్క సతీష్,ఎమ్మార్పీఎస్ నాయకులు బొల్లె అనిల్, దుమల గంగాధర్, సతీష్,తదితరులు పాల్గొన్నారు

By NYALAKONDA ANIL DESAI | February 28, 2024 | 0 Comments

ఆర్యవైశ్య సంఘ నూతన కార్యవర్గ ఎన్నిక

రాయికల్ పట్టణ ఆర్యవైశ్య సంఘ మహిళ అధ్యక్షురాలుగా జిల్లా లావణ్య , ప్రధాన కార్యదర్శిగా సిద్ధంశెట్టి స్వప్న, కోశాధికారిగా ఐతమాధవి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఏర్పాటు చేయడానికి పట్టణ సంఘ అధ్యక్షులు కూరగాయల రవికుమార్ ,ప్రధాన కార్యదర్శి గరిపెల్లి శ్రీనివాస్ ,కోశాధికారి పల్లెర్ల పవన్ కుమార్, మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | August 05, 2024 | 0 Comments

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ లో న్యాయవాది పురుషోత్తం

రాయికల్ పట్టణానికి చెందిన ప్రముఖ విద్యా, ఉద్యమకారునిగా పేరున్న న్యాయవాది అల్లే పురుషోత్తం కు జిల్లా ఎస్సి ,ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నియామకం అయ్యారు,గత ఏడూ సంవత్సరాలుగా అణగారిన దళిత వర్గాలకు అయన న్యాయవాదిగా చేస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనను నియమించడం పట్ల జిల్లా వ్యాప్తంగా దళిత వర్గాలు హర్షము వ్యక్తం చేశారు.

By Gantyala Praveen | August 10, 2024 | 1 Comments

శ్రీ నవదుర్గ సేవ సమితి నూతన కార్యవర్గ ఎన్నిక

శ్రీ నవదుర్గ సేవ సమితి మార్కండేయ నగర్ రాయికల్ వారి ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా గంట్యాల ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా మోర చైతన్య, ఉపాధ్యకులుగా జోపువర్ మాధవ్ , శ్రీరాముల సాయికిరణ్ ,సంయుక్త కార్యదర్శులుగా బూర్ల గోపి,మానాల రాము, కోశాధికారి సంగ రాము , సంయుక్త కోశాధికారులుగా అంకం శ్రీకాంత్ ,అనుమల్ల సాయి , ప్రచార కార్యదర్శిలు బొమ్మకంటి నవీన్, ప్రచార సభ్యులుగా మ్యాకల భాను, భీమనాతి రాహుల్, గట్టు నవీన్ కుమార్, సూతహరి విజయ్, నరంశెట్టి మనోజ్, బూర్ల గణేష్, సుంటిగీకర్ భారత్, పేరుమల్ల శేఖర్ లను గౌరవ సలహా దారులగా ముంజ సుజీత్, గొల్లవత్తిని భారత్, గట్టు వినయ్, సాంబారు రంజిత్, రాచకొండ సురేష్, చిట్యాల భూమేష్ లను ఎన్నుకోవడం జరిగింది.

By Gantyala Praveen | August 26, 2024 | 0 Comments

రాయికల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా నాగమల్ల శ్రీకర్

రాయికల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా నాగమల్ల శ్రీకర్,గౌరవ అధ్యక్షులుగా ఎం.డి ముజాఫర్,ఉపాధ్యక్షులుగా మచ్చ శేఖర్,ప్రధాన కార్యదర్శిగా సింగిడి శంకరయ్య,కోశాధికారిగా గుర్రాల వేణు,సంయుక్త కార్యదర్శిగా నాగిరెడ్డి రఘుపతి,కార్యవర్గ సభ్యులుగా బొమ్మకంటి వెంకటరమణ,పటేల్ నరేందర్ రెడ్డి, బొంగోని శ్రీనివాస్ గౌడ్,వాసరి రవి యాదవ్,వాసం లింబాద్రి,ఎనుగంటి రవి లను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా శ్రీకర్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ అభివృద్ధి,పాత్రికేయుల సమస్యల సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

By Gantyala Praveen | September 09, 2024 | 0 Comments

నూతన కార్యవర్గం ఎన్నిక...అధ్యక్షుడిగా చింతకుంట సాయికుమార్

రాయికల్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ జేఏసీ కార్యాలయంలో మంగళవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో అధ్యక్షులుగా చింతకుంట సాయికుమార్, ప్రధాన కార్యదర్శిగా సింగిడి శంకర్, కోశాధికారిగా కడకుంట్ల జగదీశ్వర్, ఉపాధ్యక్షులుగా యాచమనేని కిరణ్ బాబు, సింగని శ్యాంసుందర్, సంయుక్త కార్యదర్శిగా తిరుమల శంకర్, కార్యవర్గ సభ్యులుగా గంగాధరి సురేష్, కళ్ళెం శ్రీనివాస్, ఎద్దండి జితేందర్ రెడ్డి, తీగుళ్ళ గోపాల్ రెడ్డి, కనికరపు లక్ష్మణ్, గౌరవ అధ్యక్షులు సయ్యద్ రసూల్, ఎన్నికల పర్యవేక్షకులుగా గుర్రాల వేణు, పటేల్ నరేందర్, నాగమల్ల శ్రీకర్ లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | January 20, 2026 | 0 Comments

ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

రాయికల్ పట్టణం లోని ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో అధ్యక్షునిగా చెలిమెల మల్లేశం, ప్రధాన కార్యదర్శిగా ఇమ్మడి విజయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా దుగ్యాల రమాపతిరావు, కోశాధికారిగా గంట్యాల ప్రవీణ్, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ షాకీర్, సామల్ల మహేష్, సంయుక్త కార్యదర్శిగా పడాల రమేష్, సాంస్కృతిక కార్యదర్శిగా బెక్కం సుధాకర్, గౌరవ అధ్యక్షునిగా మాలావత్ వెంకటేష్ మరియు కార్యవర్గ సభ్యులుగా మామిడి రాజు, బొమ్మ కంటి అనిల్, తిరుమల శంకర్ గంగుల శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గానికి సభ్యులందరూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో సీనియర్ పాత్రికేయులు చింత కుంట సాయి కుమార్, యాచమనేని కిరణ్ బాబు, సయ్యద్ రసూల్ పాత్రికేయులు పాలేపు గణేష్ తదితరులు పాల్గొన్నారు.

By Gantyala Praveen | January 27, 2026 | 0 Comments