శనివారం రోజున రాయికల్ మున్సిపల్ పరిధిలోని 6 వార్డు మరియు 8 వార్డు అంగన్వాడి కేంద్ర పరిధిలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఐ సి డి ఎస్ సూపర్వైజర్ పద్మావతి ఆధ్వర్యంలో రాయికల్ మున్సిపల్ పరిధిలో గల 8,9, 10 అంగన్వాడి కేంద్రాలు కలిసి 7 నెలల పిల్లలకి అన్నప్రాసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతు గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు రక్తహీనత గురించి తెలుపుతూ ఎక్కువ మోతాదులో గవర్నమెంట్ హాస్పిటల్ లో డెలివరీలే జరగాలని పాప పుట్టిన వెంటనే బిడ్డకి తల్లిపాలు పట్టాలని ఆ పాలను ముర్రుపాలు అంటారని లేత పసుపు రంగులో ఉంటూ జిగుటగా ఉంటూ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని తల్లికి ఆపరేషన్ అయినా నార్మల్ అయినా బిడ్డకి తల్లిపాలు కచ్చితంగా పట్టాలని పట్టనీడల ఆ బిడ్డకి ఎలాంటి ఆపదలు వస్తాయో తెలియపరిచినారు తల్లి బిడ్డల సంరక్షణ కు మూల దారం గంటలోపు ఇచ్చే ముర్రుపాలే మూలమని మరియు తల్లికి రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుందని బిడ్డకి బిడ్డకి ఎడం పెరుగుతుందని మరియు తెలియపరుస్తూ ఏడు నెలలు నిండిన పాపకి అదనంగా బాలామృతం మరియు 16 కోడిగుడ్లు మరియు ఇతర సామాగ్రినిస్తూ ఇంట్లో వండిన ఆహారం జారుడుగా చేసి పెట్టాలని, కచ్చితంగా బిడ్డకి తల్లిపాలు పట్టాలని తెలియపరచడం జరిగింది.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.