రామగుండం ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 17 మంది పట్టుబడ్డారు. వీరిని గోదావరిఖని సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ వెంకటేష్ దుర్వ గారి ముందు హాజరుపరచగా 15 మందికి రూ.30 వేల జరిమానా విధించారు. రెండోసారి పట్టుబడిన ఇద్దరికి మూడు రోజుల జైలు శిక్ష విధించారు. వారిలో ఒకరు గోదావరిఖనిలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా, మరొకరు ఎన్టీపీసీ పవర్ ప్లాంట్‌లో ప్రైవేట్ ఉద్యోగిగా ఉన్నారు. ఇద్దరినీ కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. మద్యం సేవించి వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్ సీఐ బి. రాజేశ్వరరావు హెచ్చరించారు. వాహనదారులు వాహనాలకు సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలని, టూ వీలర్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.