|
modi add 1

డ్రంకెన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు – ఒకరికి జైలు శిక్ష

గోదావరిఖని లో మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఒకరికి 5 రోజుల జైలు శిక్ష విధించినట్లు వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఇటీవల వన్ టౌన్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 11 మందిని బుధవారం స్థానిక కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి 5 రోజుల జైలు శిక్షతో పాటు రూ.2,500 జరిమానా విధించారు. మిగిలిన 10 మందికి రూ.20 వేల జరిమానా విధించినట్లు సీఐ ఇంద్రసేనారెడ్డి వివరించారు. డ్రంకెన్ డ్రైవ్‌పై ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు.

By Ambati Sathish kumar | March 25, 2026 | 0 Comments

Hot Categories

2
7
1