న్యాయ వ్యవస్థ పై న్యాయవాదులు ప్రజల్లో నమ్మకం పెంచాలని మున్సిపల్ చైర్మన్ లయన్ మోర హన్మాండ్లు అన్నారు. బుధవారం అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కొత్తపెళ్లి రంజిత్,బొల్లె రమేష్,అల్లే పురుషోత్తం,అల్లే వనిత,మచ్చ శేఖర్,చిట్యాల నిఖిల్,మాచర్ల స్వప్న,శ్రీలక్ష్మి లను శాలువా,మెమెంటుతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని చట్టాలను ప్రజలకు వివరిస్తూ న్యాయం కోసం పోరాడాలన్నారు. న్యాయం కోసం వచ్చిన ప్రజలకు అండగా ఉండి న్యాయ సలహాలు అందించి న్యాయం జరిగేలా పోరాటం చేయాల్సిన బాధ్యత అడ్వకేట్ లకే ఉందన్నారు.న్యాయవ్యవస్థ చట్టాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్.సి మ్యాకల రమేష్,బత్తిని భూమయ్య,కాటిపెల్లి రాంరెడ్డి,కోశాధికారి కట్ల నర్సయ్య,లయన్స్ క్లబ్ సభ్యులు దాసరి గంగాధర్,బొమ్మకంటి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
నకిలీ నంబర్ ప్లేట్ వాడుతున్న వ్యక్తి అరెస్ట్: చార్మినార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్
May 30, 2026Your experience on this site will be improved by allowing cookies.