హిందూ సమ్మేళన సమితి కట్కాపూర్ శాఖ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం కరపత్రం సర్పంచ్ పడాల పూర్ణిమ తిరుపతి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కట్కాపూర్ లో గల శ్రీ సాయిబాబా గుడి ఆవరఢలో మే-1 శుక్రవారం ఉదయం-11 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు ఆధ్యాత్మిక మహోత్సవం కార్యక్రమం జరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇంటింటి నుండి ప్రతీ మహిళామూర్తి మంగళహారతులతో రావాలని మంగళహారతులతో వచ్చిన వారికి శ్రీగోమాతా ప్రతిమలు అందజేసి వేదపండితుల చేత గోపూజ చేయించడం జరుగుతుందని, భజన, సామూహిక శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం వుంటుందని ఈ కార్యక్రమాలలో పాల్గొనే వారి యొక్క సకల గ్రహదోషాలు, భూతప్రేత పిశాచాలు, నరదిష్ఠీ తొలగిపోయి సర్వసంకల్పాలు నెరవేరుతాయని అన్నారు. మార్కండేయ పంతులు గారిచే గోఫూజ, వారి అనుగ్రహ భాషణం ఉంటుందని, అలాగే ప్రధాన వక్త గోల్కొండ నాగరాజు జిల్లా కార్యవాహ్ బౌద్ధిక్ వుంటుందని అన్నారు. శుక్రవారం పౌర్ణమి రోజున అందరు తమ తమ ఇండ్లలో అలుకుచల్లుకుని ఇంటిల్లిపాదు అందరు రావాలని అన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కట్కాపూర్, దావన్ పల్లి, వస్తాపూర్, తాట్లవాయి, కైరిగూడెం, ధర్మాజీపేట్, అల్యానాయక్ తండా గ్రామాల మహిళా మూర్తులు అందరు మంగళహారతులతో రావాలని, శ్రీహనుమాన్ భక్తులు వచ్చి సామూహిక చాలీసా పారాయణం లో పాల్గొనాలని, వచ్చిన భక్తులకు భోజన వ్యవస్థ కలదని వేలాదిగా తరళివచ్చి కార్యక్రమం విజయవంతం చేయాలని వారు తెలిపారు. ఈ అత్తినేని శ్రీనివాస్, బయ్యని గోపాల్, కాశయ్య, అమ్ముల మల్లయ్య, కాశవేని రాజేందర్, కాసాల లక్ష్మీనారాయణ, నాయిని రాజు, అత్తినేని వేణు, బొడ్డు మల్లేషం, మైదం శ్రీను, ఈట్నేని భాగ్య లక్ష్మీ, కాసాల గంగవ్వ తదితరులు పాల్గొన్నారు.


Comments 0