భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలిచింది "చేనేత" కళ అని రాయికల్ పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు భోగ రాజేశం అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాయికల్ పట్టణంలోని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ చెమట చుక్కల్ని చీరలుగా మలచి.. మనిషికి నాగరికతను అద్దింది నేత కార్మికులని పేర్కొన్నారు.దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.ప్రాచీన కాలం నుంచే మన దేశంలో మగ్గాల ద్వారా చేనేత ఉత్పత్తి జరిగిందని మొదట్లో ఈ విధానంతో వస్త్ర ఉత్పత్తికి చాలా సమయం పట్టేదన్నారు. ఇంగ్లాండ్ కు చెందిన జాన్ కే 1733 లో ఫ్లై షటిల్ ను కనిపెట్టాక మగ్గం ద్వారా వస్త్రాల ఉత్పత్తి సామర్థ్యం బాగా పెరిగింది అన్నారు.1801 లో జోసెఫ్ ఎం జాకార్డ్ పెద్ద డిజైన్లు రూపొందించే పరికరాన్ని తయారు చేయగా ప్రస్తుతం చేనేత రంగంలో ఉపయోగిస్తున్నారని ఆ పరికరాన్ని జాకార్డ్ గా పిలువ పడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులుగా దాసరి గంగాధర్, ప్రధాన కార్యదర్శి కడకుంట్ల నరేష్,కోశాధికారి ఆడెపు నర్సయ్య,పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు సామల్ల సతీష్,ఉపాధ్యక్షులు సింగని సతీష్,ప్రధాన కార్యదర్శి ఆడెపు రాజీవ్,కోశాధికారి బొమ్మ కంటి నవీన్,సంయుక్త కార్యదర్శి గంట్యాల ప్రవీణ్,మాజీ అధ్యక్షులు తాటిపాముల విశ్వనాథం,మ్యాకల కాంతారావు,గాజంగి అశోక్,బొమ్మ కంటి గోపాల్, సభ్యులు మచ్చ నారాయణ,మామిడాల లక్ష్మీనారాయణ,వాసం స్వామి,దాసరి గంగాధర్,దిలీప్,లక్ష్మీనారాయణ,ప్రభాకర్,గంగన్న,మధు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Your experience on this site will be improved by allowing cookies.